కొళాయి కనెక్షన్లు క్రమబద్ధీకరించుకోవాలి: కమిషనర్

ATP: అనంతపురం కార్పొరేషన్ నగరంలోని నీటి కుళాయి కనెక్షన్ కలిగిన అసెస్మెంట్రులు క్రమబద్ధీకరించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నెల రోజుల్లో క్రమబద్ధీకరించుకోకుంటే కనెక్షన్లు తొలగించడంతోపాటు భవిష్యత్తులో కనెక్షన్ పొందాలంటే రెట్టింపు చార్జీలు వసూలు చేస్తామని నగర వాసులకు సూచించారు.