తాగునీటి సమస్య పరిష్కరించాలి

ASR: అనంతగిరి మండలంలోని కాశీపట్నం పంచాయతీ పరిధి తట్టవలసలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో ఉన్న చేతిపంపు వద్ద సరిగా మంచినీరు రాకపోవడంతో వేసవి దృష్ట్యా.. తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. 2 కిలోమీటర్ దూరంలోని కౌడీలతో ఊటనీటిని తెచ్చుకొని తమ అవసరాలకు వినియోగించుకుంటున్నామని వాపోయారు.