VIDEO: స్టీల్ ప్లాంట్‌లో కార్మికుల ఆందోళన
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికులు మరోసారి ధర్నాకు దిగారు. ప్లాంట్‌లోని అడ్మిన్ బిల్డింగ్ ఎదుట భారీ స్థాయిలో నిరసన చేపట్టారు. ఉత్పత్తి ఆధారంగా కార్మికులకు వేతనాలను చెల్లించాలన్న సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం నాణ్యమైన రా మెటీరియల్స్ సరఫరా, యంత్రాల మరమ్మతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని.. ఆ వైఫల్యాలను తమపై మోపడం అన్యాయమన్నారు.