ప్రారంభానికి ముందే శిథిలావస్థకు పల్లె దవాఖాన

ప్రారంభానికి ముందే శిథిలావస్థకు పల్లె దవాఖాన

GDWL: అలంపూర్ హరిజనవాడలో రెండేళ్ల క్రితం నిర్మించిన పల్లె దవాఖాన భవనం అసంపూర్తిగా మారి నిరుపయోగంగా ఉంది. విద్యుత్, నీటి సౌకర్యం లేక కాంట్రాక్టర్ పనులు వదిలేయడంతో భవనం పాడుబడుతోంది. ప్రస్తుతం పాఠశాలలోని చిన్న గదిలో వైద్యం అందిస్తున్న సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే పనులు పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.