పులి సంచారం.. డప్పు చాటింపుతో అప్రమత్తత

పులి సంచారం.. డప్పు చాటింపుతో అప్రమత్తత

ASF: బెజ్జూర్ మండలంలోని సులుగుపల్లి, సలుగుపల్లి, లంబడి గూడ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని గ్రామపంచాయతీ అధికారులు డప్పు చాటింపు వేయించారు. ఆయా గ్రామాల్లోని రైతులు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా పనికి వెళ్లాలని ఉదయం 8 గంటల వరకు పనులకు వెళ్లకూడదని తెలిపారు. సాయంత్రం 5:00 గంటల లోపు ఇళ్లకు చేరుకోవాలని కోరారు.