తాటిచెట్టుపై పిడుగుపాటు

తాటిచెట్టుపై పిడుగుపాటు

SDPT: జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. తొగుట మండలంలోని గుడికందుల గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో తాటి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టుపై మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న కొంతమంది భయాందోళనకు గురయ్యారు. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.