వేగవంతమైన మామునూర్ ఎయిర్‌పోర్టు భూసేకరణ

WGL: మామునూర్ ఎయిర్‌పోర్టు భూసేకరణ వేగవంతమైంది. 48 మంది రైతులకు సంబంధించిన రూ.34.86 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. వ్యవసాయ భూములకు ఎకరాకు రూ.కోటి 20లక్షల చొప్పున చెల్లించారు. మొత్తం 253 ఎకరాల భూమిని సేకరించడానికి ఇప్పటికే ప్రభుత్వం రూ.205 కోట్లను విడుదల చేయగా, వాటి నుంచి రూ.34.86 కోట్లను జమ చేశారు.