గుంతల మయంగా మారిన రోడ్డు.. ప్రజల ఇబ్బందులు

GDWL: మానవపాడు మండల కేంద్రం నుంచి చెన్నిపాడు మీదుగా చాలామంది నాగర్‌కర్నూల్ పట్టణానికి రాకపోకలు సాగిస్తుంటారు. కానీ ఈ రహదారి పూర్తిగా గుంతలు ఏర్పడి అటువైపు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణం చేయాలంటే వాహనదారులు నరకయాతన పడుతున్నారు. నామమాత్రంగా మరమ్మతులు చేపట్టి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతుల చేయాలని ప్రజలు కోరుతున్నారు.