VIDEO: విద్యతోపాటు క్రీడలలో కూడా రాణించాలి: ఎమ్మెల్యే
SKLM: విద్యతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. ఇవాళ నరసన్నపేట మండలం ఉర్లాం జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా విద్యార్థులు రాణించాలని ఆ దిశగా కృషి చేయాలని వివరించారు.