శెట్టిపాలెంలో గ్రామసభ నిర్వహించిన తహశీల్దార్

శెట్టిపాలెం సర్పంచ్ అల్లు రామనాయుడు ఇటీవల ఓటర్ల జాబితాలోని మైగ్రేషన్ ఓటర్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మండల తహశీల్దార్ మురళీమోహన్ రావు సోమవారం శెట్టిపాలోంలో గ్రామ సభ నిర్వహించారు. సమస్యలపై టీడీపీ, వైసీపీ నేతల నుంచి అభ్యంతరాలు తీసుకున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.