'తెలుగు భాషకు బ్రౌన్ చేసిన సేవలు చిరస్మరణీయం'
VZM: తెలుగు నిఘంటువు రచయిత, ఆంధ్రభాషా పండితుడు బ్రౌన్ జయంతిని కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. DRO ఎస్. శ్రీనివాసమూర్తి బ్రౌన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగు భాషను, ప్రాచీన సాహిత్యాన్ని సంరక్షించడంలో బ్రౌన్ చేసిన కృషి ప్రతి తెలుగు వాడికి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.