VIDEO: నిజామాబాద్‌లో సందడి చేసిన నిధి అగర్వాల్
NZB: నిజామాబాద్ నగరంలో ఓ నూతన షోరూమ్ ప్రారంభోత్సవానికి సినీ నటి నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన అభిమాన తారను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.