రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి

మేడ్చల్: గత నెల 29న బోయిన్‌పల్లి బస్ స్టాప్‌లో నేషనల్ టీ పాయింట్ హోటల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 64 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వృద్ధుడు గాయపడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతు సోమవారం మృతి చెందినట్లు బోయినపల్లి ఎస్సై శివశంకర్ తెలిపారు.సేఫ్ ఎక్స్‌ప్రెస్ రోడ్డు వైపు వెళుతున్న ద్విచక్ర వాహనం అతివేగంగా వచ్చి వృద్ధుడిని ఢీకొట్టింది.