విద్యుత్ షాక్‌తో మూగజీవి మృతి
NRPT: గుండుమాల్ మండలంలో బుధవారం విద్యుత్ ఘాతంతో ఓ మూగజీవి మృతి చెందింది. మండల కేంద్రంలో రహదారి పక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మర్‌కు రక్షణ కంచె లేకపోవడమే దీనికి కారణమని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు. అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్‌లకు కంచె ఏర్పాటు చేయాలన్నారు.