విద్యుత్ సరఫరాకు అంతరాయం
W.G: భీమవరం మండలంలోని పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. లోసరిలో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ ఉప కేంద్రానికి లైన్ ఏర్పాటు పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. లోసరి, దెయ్యాలతిప్ప, తోక తిప్ప, నాగేంద్రపురం గ్రామాల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సరఫరా నిలిచిపోనుంది.