'పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి'
SKLM: శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు డిమాండ్ చేశారు. టెక్కలి సీపీఎం కార్యాలయంలో వామపక్షాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాకు ఇచ్చిన హామీలను ఎప్పుడూ నెరవేరుస్తారని ప్రశ్నించారు. జిల్లాను అభివృద్ధి బాటలో ఉంచాలని, పనులు పూర్తి చేయాలన్నారు.