రెండు కార్లు ఢీ..తప్పిన ప్రమాదం

రెండు కార్లు ఢీ..తప్పిన ప్రమాదం

KRNL: నంద్యాల-ఆత్మకూరు మధ్యలో రెండు కార్లు ఢీకొన్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. శ్రీశైలం వెళ్తున్న కారు ఆత్మకూరు నుంచి వస్తున్న కారు ఎదురెదురుగా ప్రమాదవశాత్తు ఢీకొనడంతో రెండు కార్లు డ్యామేజ్ అయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.