నర్సీపట్నంలో ఆగిన మంచినీటి సరఫరా
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ అబిడ్స్ సెంటర్‌లో మంచినీటి పైపులైను బుధవారం మరమ్మతులకు గురైంది. దీంతో అనేక వార్డులకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. పైప్ లైన్ లీకేజ్ సమాచారం అందుకున్న మునిసిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మరమత్తు పనులు చేపట్టారు. సాధ్యమైనంత వేగంగా మరమ్మత్తులు చేసి మంచినీటి సరఫరా పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.