కార్యకర్తలకు BRS అండగా ఉంటది: మాజీ MLAసతీష్

కరీంనగర్: కార్యకర్తలకు అండగా BRS పార్టీ ఉంటుందని హుస్నాబాద్ మాజీ MLA సతీష్ అన్నారు. ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన BRS పార్టీ కార్యకర్త జయపాల్ రెడ్డి ప్రమాదవశాత్తూ మరణించగా, BRS సభ్యత్వ ప్రమాద బీమా ద్వారా మంజూరైన 2 లక్షల విలువైన చెక్కును నామినీగా ఉన్న ఆయన భార్య లక్ష్మికి వారి కుటుంబసభ్యుల సమక్షంలో మాజీ MLA సతీష్ కుమార్ అందజేశారు.