వంతెన పనులపై కలెక్టర్ అసంతృప్తి.!
ASF: తిర్యాణి మండలంలోని అమినూడ వంతెన పనులు అసంపూర్తిగా ఉండటంపై జిల్లా కలెక్టర్ హరిత అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు ఆగిపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వంతెన అందుబాటులోకి వస్తే ఎన్ని గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుందో ఆరా తీశారు. నిలిచిపోయిన పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.