VIDEO: బోయకొండలో లక్ష కుంకుమార్చన
CTR: చౌడేపల్లి మండలంలోని శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించనున్నట్లు EO ఏకాంబరం తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలు, కరపత్రాలను మంగళవారం విడుదల చేశారు. ఫిబ్రవరి 4 నుండి 6 వరకు లక్ష కుంకుమార్చన జరుగుతుందని వెల్లడించారు. అమ్మవారి కోసం కుంకుమార్చన ప్రత్యేకంగా ప్రీతిపాత్రమైనది అని పేర్కొన్నారు.