రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగు నీరు
E.G: రాజమండ్రిలోని మున్సిపల్ కాలనీ 45వ వీధిలో డ్రైనేజీలోని మురుగు నీరు రోడ్డుపై చేరుతోంది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత మూడు రోజులుగా రోడ్డుపై మురుగు నీరు ప్రవహించడంతో ఇబ్బందిపడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డుపైకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు.