కొవ్వూరు రైల్వే హాల్ట్ పునరుద్ధరణకు డిమాండ్
E.G: విజయదశమి సెలవుల తర్వాత బంధువుల ఇళ్ల నుంచి కొవ్వూరుకు తిరిగివచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి సభ్యులు ఆదివారం తెలిపారు. రాజమండ్రి స్టేషన్ నుంచి ప్రయాణం వలన గోదావరి బ్రిడ్జిపై ట్రాఫిక్, అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందన్నారు. 2019లో నిలిపిన కొవ్వూరు రైల్వే హాల్ట్‌ను పునరుద్ధరించాలని కోరారు.