వన దుర్గమ్మ వద్ద కొనసాగుతున్న వరద ప్రవాహం

వన దుర్గమ్మ వద్ద కొనసాగుతున్న వరద ప్రవాహం

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలోని వనదుర్గమ్మ గుడి ఎదుట సోమవారం నది జల ప్రవాహం కొనసాగింది. గత వారం నుంచి ప్రధాన ఆలయం జలదిగ్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. ఎగువ నుంచి వరద ఉద్ధ‌ృతి తగ్గకపోవడంతో అమ్మవారు గంగమ్మ ఒడిలోనే ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం రాజగోపురంలో దుర్గమ్మకు పూజలు చేస్తున్నారు.