'స్థానిక ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి'
NZB: స్థానిక ఎన్నికల ఏర్పాట్లు సజావుగా జరిగేలా పర్యవేక్షించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ అధికారులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రానికి వచ్చిన ఆయన ఎంపీడీవో కార్యాలయంలోని బ్యాలెట్ బాక్సులను పరిశీలించారు. గ్రామ పంచాయతీ వద్ద జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను కూడా ఆయన తనిఖీ చేశారు.