ఎరువుల దుకాణం తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయాధికారి

MDK: ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాలలో గల ఎరువులను, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన ఎరువులను అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణ అధికారి రాజశేఖర్ పాల్గొన్నారు.