'ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించాలి'

'ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించాలి'

ELR: సాంకేతికత, ఉన్నత ప్రమాణాలను కలిగిన విద్యను విద్యార్థులకు అందించాలని కైకలూరు ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. భైరవపట్నంలో బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవాలులో ఆయన పాల్గొన్నారు. వేలాది మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన ఈ పాఠశాల 'శతాబ్ది ఉత్సవాలు' జరుపుకోవడం మనందరికి గర్వకారణమన్నారు.