ఆ కార్యదర్శులకు సమన్లు జారీ చేస్తాం: సుప్రీం
సైనిక శిక్షణలో ప్రమాదవశాత్తు గాయపడి అంగ వైకల్యానికి గురైన అభ్యర్థులకు ఆర్థిక సహకారం అందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు 6 వారాల గడువు ఇచ్చింది. ఒకవేళ ఈ విషయంపై తగిన నిర్ణయం తీసుకోవడంలో విఫలమైతే రక్షణ, ఆర్థిక శాఖల కార్యదర్శులు కోర్టులో హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు సమన్లు జారీ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.