బీచుపల్లి వద్ద నిండుగా ప్రవహిస్తున్న కృష్ణా నది

బీచుపల్లి వద్ద నిండుగా ప్రవహిస్తున్న కృష్ణా నది

GDWL: ఇటిక్యాల మండలం బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద కృష్ణానది నిండుగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీరు పెద్ద ఎత్తున కృష్ణా నదిలో పారుతోంది. జూరాల నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేయడంతో కృష్ణ నదినీరు బీచుపల్లి వద్ద ఉన్న పుష్కర ఘాట్‌ను తాకింది. నదిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు.