తెనాలిలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
GNTR: తెనాలిలోని టౌన్ చర్చ్ ఎదురు వీధిలో వ్యభిచార గృహంపై పోలీసులు గురువారం రాత్రి దాడులు చేశారు. వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో సీఐ మల్లికార్జున రావు తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న నర్రా గోపి, సయ్యద్ ఆసియాను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. వీరితో పాటు ఒక విటుడు, విటురాలిపై కేసు నమోదు చేశామన్నారు.