స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి'
VKB: స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రతిజ్ఞ జైన్ కోరారు. వికారాబాద్ జిల్లాలోని సెకండ్ ఫేజ్‌లో మొత్తం ఏడు మండలాల్లో పోలింగ్ జరగనుంది. బంట్వారం గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు.