జీడీ నెల్లూరులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
CTR: జీడీ నెల్లూరు మండలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సీఐ ప్రసాద్ వివరాల మేరకు.. వీరకనెల్లూరు గ్రామ శివారు రెవెన్యూ భూమిలో బుధవారం డెడ్ బాడీని స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వ్యక్తి మృతిపై ఆరా తీశారు. వ్యక్తి సమాచారం తెలియలేదని, వివరాలు తెలిస్తే 9440796716కు తెలుపాలని కోరారు.