ఉద్యోగులకు ఎమ్మెల్యే హెచ్చరిక

NLR: ఉలవపాడు మండలంలోని కరేడు, అలగాయపాలెం సచివాలయాలను ఎమ్మెల్యే నాగేశ్వరరావు మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజాసేవలో నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన ఉద్యోగులను హెచ్చరించారు. అటెండెన్స్, మూవ్మెంట్ రిజిస్టర్లను పరిశీలించి, విధులకు హాజరైన, అనుమతి లేకుండా బయటకు వెళ్లిన సిబ్బంది వివరాలను ఆయన ఆరా తీశారు.