గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
MHBD: తొర్రూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఇవాళ కలెక్టర్ స్నేహ శబరిష్ తనిఖీ చేశారు. ఈ మేరకు ఆమె రికార్టులను, హాజరు పట్టికను పరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చూపుతే చర్యలు తప్పవని ఉపాధ్యాయులను హెచ్చరించారు. ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రధాన్యతను ఇస్తుందన్నారు. గురుకులాలలో విద్యార్థుల సంక్షేమం కోసం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు.