దొర్నిపాడు మండలంలో తీవ్రంగా కుక్కల బెడద
NDL: దొర్నిపాడు మండలంలోని వివిధ గ్రామాల్లో వీధి కుక్కల బెడద తీవ్రంగా మారిందని సోమవారం ప్రజలు వాపోయారు. వీధుల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్న వీధి కుక్కల కారణంగా చిన్నపిల్లలు బయట తిరగడానికి కూడా ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి ఏటా 100కు పైగా కుక్కకాటు బాధితులు చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.