నేత్రదానంతో ఇద్దరికి వెలుగునిచ్చిన వెంకటమ్మ
MBNR: భూత్పూర్ మండలం పాత కప్పేట గ్రామానికి చెందిన వడ్డే వెంకటమ్మ శనివారం మృతి చెందారు. ఆమె కుమారుడు నరసింహ అశోక్, జూనియర్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ కందుకూరు అశోక్ కుమార్ ఒప్పందం మేరకు తల్లి నేత్రాలను హైదరాబాదులోని ఎల్వి ప్రసాద్ ల్యాబ్‌కు దానం చేశారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ఒకరి నేత్రదానం ఇద్దరికి చూపును అందిస్తుందని తెలిపారు.