అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్ల పట్టివేత

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2  ట్రాక్టర్ల పట్టివేత

PDPL: ముత్తారం మండలంలోని ఓడేడు శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్పై ఎన్.రవికుమార్ తెలిపారు. సిబ్బందితోపెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, అక్రమంగా ఇసుక తరలిస్తున్న టీఎస్ 25ఏ6351, టీఎస్ 22జీ5168 నంబర్‌లు గల ట్రాక్టర్లను గుర్తించి పట్టుకొని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు.