తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో వృత్తి విద్యా శిక్షణా తరగతులు
W.G తణుకు ఎస్.ఎన్.వి.టి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం.ఎల్.టి గ్రూపు చదువుతున్న మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వృత్తి విద్యా శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ వి.తులసిలక్ష్మితెలిపారు. ఈ మేరకు తణుకులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో ఈ తరగతులు ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. ఇందులో అధ్యాపకులు ఎం.ఎస్.ఆర్ రాజేశ్వరి పాల్గొన్నారు.