'నీటి తొట్టెల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు'

SKLM: గ్రామీణ ప్రాంతాల్లో గోశాలలు, పశువుల నీటి తొట్టెల నిర్మాణాలు మెరుగుపరిచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శంకర్ సూచించారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే శంకర్ డ్వామా అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో భూగర్భ జలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.