పేకాట శిబిరంపై దాడి చేసిన పోలీసులు
NTR: మైలవరం మండలంలో పోరాటనగర్ అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న జూదం ఆడే శిబిరంపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 49 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. రూ. 1,15,600 నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీనుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.