ఇసుక ట్రాక్టర్ల సీజ్.. ఇద్దరిపై కేసు

ఇసుక ట్రాక్టర్ల సీజ్.. ఇద్దరిపై కేసు

KMR: నిజాం సాగర్ మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఆదివారం కల్లేరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నల్లవాగు నుంచి వడ్డేపల్లి వైపు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా, పోలీసులు గస్తీ నిర్వహిస్తూ తనిఖీ చేశారు. ఇసుక తరలింపునకు సంబంధించి ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు.