రైతుల పంపుసెట్ల వైరు చోరీ

రైతుల పంపుసెట్ల వైరు చోరీ

KNR: అన్నదాతలను దొంగలు బెంబేలెత్తిస్తున్నారు. శంకరపట్నం మండలంలోని ఆముదాలపల్లి గ్రామానికి చెందిన 8 మంది రైతుల వ్యవసాయ పంపుసెట్ల సర్వీస్ వైరులను గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి అపహరించుకుపోయారు. కన్నబోయిన రవీంద్ర ప్రసాద్, లక్ష్మణ్, అజయ్, జంపయ్య, సమ్మయ్య, సమ్మిరెడ్డిలతోపాటు మరో ఇద్దరు రైతులకు చెందిన సర్వీసు వైర్లను దొంగలు ఎత్తుకెళ్లారు.