నెల్లూరులో తల్లి మందలించిందని కుమారుడు పరార్

NLR: మైపాడు రోడ్డులోని శ్రీరామ్ నగర్‌కు చెందిన అశ్విన్ అనే యువకుడు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఆ యువకుడు తల్లి దివ్య నవాబుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చదువుకోమని రోజూ చెప్పడంతో తన కుమారుడు జనవరి 27వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆమె తెలిపారు. బంధువులు ఇళ్లలో గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.