VIDEO: వైద్యుడికి ఆపరేషన్ తెలియక.. రోగి మృతి
RR: వైద్యుడికి ఆపరేషన్ తెలియక రోగి మృతి చెందిన ఘటన హయత్ నగర్ పీఎస్ పరిధిలో జరిగింది. సైదా క్లినిక్‌కు పైల్స్ ఆపరేషన్ కోసం ఓ వ్యక్తి వెళ్లాడు. వైద్యుడికి ఆపరేషన్ ఎలా చేయాలో తెలియకపోవడంతో శరీరం నుంచి రక్తం పూర్తిగా పోవడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు క్లినిక్ ముందు ఆందోళనకు దిగారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.