ముందు నల్లమల్లసాగర్.. తర్వాతే బనకచర్ల!

ముందు నల్లమల్లసాగర్.. తర్వాతే బనకచర్ల!

AP: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు స్థానంలో పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టును సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిలో భాగంగా బొల్లాపల్లి జలాశయానికి నీళ్లు తరలించి.. అక్కడి వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నల్లమలసాగర్ జలాశయానికి గోదావరి నీళ్లను తీసుకెళ్లనుంది. తొలుత ఈ ప్రాజెక్టును చేపట్టి.. తదుపరి దశలో బనకచర్లకు మళ్లించాలని అంచనా వేస్తోంది.