ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

VZM: గంట్యాడ మండలం రామవరం యాతవీధికి చెందిన కొల్లి సూరి దేముడు (41) అనే వ్యక్తి బుధవారం రామవరంలోని అయ్యన్న బంధ చెరువుకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువుల పడి మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.