అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

MDK: పొలంలో ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. అంబాజీపేట గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి వయసు 30 నడుచుకుంటూ వెళ్లి పొలంలో పడి చనిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన వ్యక్తి చందాపూర్ గ్రామానికి చెందిన రాజుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.