నేను మందు తాగితే.. వాళ్లు పెగ్గు కలిపారా?

AP: శ్రీశైలం ఇష్యూపై MLA బుడ్డా రాజశేఖరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తప్ప తాగి.. ఫారెస్ట్ అధికారులపై దాడి చేశానని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తప్పుడు కూతలు కూస్తున్నాడంటూ మండిపడ్డారు. గెస్ట్ హౌస్‌లో తాను మందు తాగానని శిల్పా ఆరోపిస్తున్నాడు.. తాను మందు తాగుతుంటే శిల్పా, అంబటి రాంబాబు ఒకరు సోడా కలిపితే.. మరొకరు పెగ్గు వేశారా? అని ఎద్దేవా చేశారు.