VIDEO: భారీ చోరీ.. రూ.2 కోట్ల ఆభరణాల దోపిడీ..!
AKP: చోడవరం మండలం గోవాడ గ్రామంలో భారీ దొంగతనం కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు ఒక ఇంట్లోకి చొరబడి, సుమారు రూ.2 కోట్లకు పైగా విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.