రామ్ చరణ్ బర్త్‌డే వేడుకల్లో 'శివన్న'

రామ్ చరణ్ బర్త్‌డే వేడుకల్లో 'శివన్న'

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ పాల్గొన్నాడు. బెంగళూరులో రామ్ చరణ్ అభిమానులతో కలిసి శివన్న కేక్ కట్ చేసి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, చరణ్ 'పెద్ది' చిత్రంలో శివ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.